Abn logo
May 5 2021 @ 11:39AM

బెంగాల్ హింస‌పై మ‌మ‌త ఏమ‌న్నారంటే...

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజ‌యం సాధించిన టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ప‌ద‌విని స్వీక‌రించారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. 

తెల్ల రంగు చీరలో బెంగాలీలో ప్రమాణం చేసిన తర్వాత మమతా బెనర్జీ అందరినీ పలుక‌రిస్తూ.... ఈ రోజు ఉదయం 11:30 గంటలకు కరోనా ప‌రిస్థితుల‌పై సమావేశం నిర్వహించబోతున్నామ‌న్నారు. దీని తరువాత, మూడు గంటలకు విలేకరుల సమావేశం నిర్వ‌హించ‌నున్నామ‌న్నారు. బెంగాల్‌లో కొనసాగుతున్న హింసపై వ‌స్తున్న వార్త‌ల‌పై మమతా బెనర్జీ స్పందిస్తూ... ప్రతి ఒక్కరూ శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ పార్టీకి చెందిన‌వారైనా హింసకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. నేను శాంతియుత వాతావర‌ణానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాన‌ని, దానినే కొన‌సాగిస్తాన‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా గవర్నర్ జగదీప్ మాట్లాడుతూ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని గౌర‌విస్తార‌ని, హింసాయుత ఘ‌ట‌న‌ల‌పై కఠిన చర్యలు తీసుకుంటార‌ని భావిస్తున్నాన‌న్నారు. కాగా దేశంలో కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించలేదని ఒక‌ అధికారి తెలిపారు.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 292 సీట్లలో 213 గెలిచి టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 77 స్థానాలను బీజెపీ గెలుచుకుంది. అదే సమయంలో ఇతరులు రెండు సీట్లు గెలుచుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement