కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌లో ఆదర్శ నగరంగా బెంగళూరు

ABN , First Publish Date - 2020-05-28T23:38:00+05:30 IST

కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌లో బెంగళూరు నగరానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌లో ఆదర్శ నగరంగా బెంగళూరు

బెంగళూరు : కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌లో బెంగళూరు నగరానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తమ పని తీరుతో అందరి మన్ననలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరి ఘనతను గుర్తించింది. 


కోవిడ్-19 మేనేజ్‌మెంట్‌లో ఆదర్శ నగరంగా బెంగళూరును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ఘనతను జైపూర్, ఇండోర్, చెన్నై నగరాలతోపాటు బెంగళూరు పంచుకుంటోంది. 


బెంగళూరులో కోవిడ్-19 గ్రాఫ్ పెరగకుండా చూడటం కోసం టెక్నాలజీని చక్కగా వినియోగించారు. కోవిడ్-19 కేసులతో వైద్య సిబ్బంది, ఇతర అధికారులు వ్యవహరించిన తీరు, చికిత్స పద్ధతులు కూడా ప్రశంసలందుకుంటున్నాయి. 


బెంగళూరు ప్రభుత్వాధికారులు తమ విజయ గాథలను ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లోని అధికారులతో పంచుకుంటున్నారు. 


కర్ణాటక ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జావేద్ మాట్లాడుతూ, కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగకుండా జాగ్రత్తలు పాటించినందువల్లే బెంగళూరు నగరం ఆదర్శ నగరంగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. కేసులు వెల్లడైన ప్రాంతాన్ని వేగంగా మూసివేశామని తెలిపారు. పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ పర్సన్స్‌ను గుర్తించడంలో కూడా అత్యంత చురుగ్గా వ్యవహరించామన్నారు.


Updated Date - 2020-05-28T23:38:00+05:30 IST