డివిల్లీర్స్‌ ధనాధన్‌

ABN , First Publish Date - 2020-10-18T09:25:45+05:30 IST

ఏబీ డివిల్లీర్స్‌ (22 బంతుల్లో ఫోర్‌, 6 సిక్సర్లతో 55 నాటౌట్‌) తుఫాన్‌ అర్ధ శతకంతో.. క్రిస్‌ మోరిస్‌ (4/26) బంతితో అదరగొట్టడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో విజయాన్ని...

డివిల్లీర్స్‌ ధనాధన్‌

 రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

 మోరి్‌సకు నాలుగు వికెట్లు


దుబాయ్‌: ఏబీ డివిల్లీర్స్‌ (22 బంతుల్లో ఫోర్‌, 6 సిక్సర్లతో 55 నాటౌట్‌) తుఫాన్‌ అర్ధ శతకంతో.. క్రిస్‌ మోరిస్‌ (4/26) బంతితో అదరగొట్టడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 177/6 స్కోరు చేసింది. స్మిత్‌ (57), ఊతప్ప (41) మెరిశారు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 179/3తో లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ (43), పడిక్కళ్‌ (35) రాణించారు. డివిల్లీర్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది’ మ్యాచ్‌ దక్కింది. 

‘డెత్‌’లో సిక్స్‌ల మోత: బెంగళూరు ఛేదనలో డివిల్లీర్స్‌ ఆటే హైలైట్‌. 14 ఓవర్లలో జట్టు స్కోరు 102/3తో కష్టాల్లో ఉన్న దశలో డివిల్లీర్స్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో  మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి 12 బంతుల్లో 35 పరుగులు అవసరమవగా.. ఉనాద్కట్‌ వేసిన 19వ ఓవర్‌లో డివిల్లీర్స్‌ మూడు వరుస సిక్స్‌లతో 25 రన్స్‌ పిండుకోవడంతో.. సమీకరణలు మారిపోయాయి. ఓపెనర్‌ ఫించ్‌ (14) స్వల్ప స్కోరుకే అవుటైనా.. కోహ్లీ, మరో ఓపెనర్‌ పడిక్కళ్‌  రెండో వికెట్‌కు 79 పరుగులతో ఆదుకున్నారు. అయితే, పడిక్కళ్‌ను తెవాటియా.. కోహ్లీని త్యాగి వెంటవెంటనే అవుట్‌ చేయడంతో చాలెంజర్స్‌ ఇబ్బందుల్లో పడింది. కానీ, గుర్‌కీరత్‌ (19 నాటౌట్‌)తో కలసి డివిల్లీర్స్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు గీత దాటించాడు. 

నడిపించిన స్మిత్‌: మోరిస్‌ వణికించినా.. కెప్టెన్‌ స్మిత్‌ అర్ధ శతకంతో ముందుండి నడిపించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌కు ఓపెనర్లు ఊతప్ప, స్టోక్స్‌ (15) శుభారంభాన్ని అందించారు. అయితే, స్టోక్స్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన మోరిస్‌.. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. 8వ ఓవర్‌లో చాహల్‌ (2/34).. ఊతప్ప, శాంసన్‌ (9)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసి రాజస్థాన్‌కు షాకిచ్చాడు. కానీ, స్మిత్‌.. నాలుగో వికెట్‌కు బట్లర్‌ (24)తో కలసి 58 పరుగులు, తెవాటియా (19 నాటౌట్‌)తో కలసి ఐదో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యంతో నిలబెట్టాడు. బట్లర్‌, స్మిత్‌, ఆర్చర్‌ (2)ను మోరిస్‌ అవుట్‌ చేశాడు. 

స్కోరుబోర్డు

రాజస్థాన్‌: ఊతప్ప (సి) ఫించ్‌ (బి) చాహల్‌ 41, స్టోక్స్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) మోరిస్‌ 15, శాంసన్‌ (సి) మోరిస్‌ (బి) చాహల్‌ 9, స్మిత్‌ (సి) షాబాజ్‌ (బి) మోరిస్‌ 57, బట్లర్‌ (సి) సైనీ (బి) మోరిస్‌ 24, తెవాటియా (నాటౌట్‌) 19, ఆర్చర్‌ (ఎల్బీ) మోరిస్‌ 2; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 177/6; వికెట్ల పతనం: 1-50, 2-69, 3-69, 4-127, 5-173, 6-177; బౌలింగ్‌: సుందర్‌ 3-0-25-0, మోరిస్‌ 4-0-26-4, ఉడాన 3-0-43-0, సైనీ 4-0-30-0, చాహల్‌ 4-0-34-2, షాబాజ్‌ అహ్మద్‌ 2-0-18-0. 

బెంగళూరు: పడిక్కళ్‌ (సి) స్టోక్స్‌ (బి) తెవాటియా 35, ఫించ్‌ (సి) ఊతప్ప (బి) గోపాల్‌ 14, కోహ్లీ (సి) తెవాటియా (బి) త్యాగి 43, డివిల్లీర్స్‌ (నాటౌట్‌) 55, గుర్‌కీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 19.4 ఓవర్లలో 179/3; వికెట్ల పతనం: 1-23, 2-102, 3-102; బౌలింగ్‌: ఆర్చర్‌ 3.4-0-38-0, శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-32-1, త్యాగి 4-0-32-1, ఉనాద్కట్‌ 4-0-46-0, తెవాటియా 4-0-30-1.


Updated Date - 2020-10-18T09:25:45+05:30 IST