Advertisement
Advertisement
Abn logo
Advertisement

పర్యాటక ప్రాంతంగా బంగ్లాదేశ్‌ నౌక

29 నుంచి పర్యాటకులకు అనుమతి

మంత్రి ముత్తంశెట్టి

విశాలాక్షినగర్‌, డిసెంబరు 2: తెన్నేటి పార్కు పార్కు తీరానికి గత ఏడాది కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌ కార్గో నౌక ‘ఎంవీ మా’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఈ నెల 29 నుంచి నౌకలోకి పర్యాటకులను అనుమతిస్తామని  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తెన్నేటి పార్కులో గురువారం సాయంత్రం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మరో నాలుగు నెలల్లో దీనిని ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొత్త టూరిజం పాలసీ మేరకు రాష్ట్రంలో ఐదు సెవెన్‌ స్టార్‌ హోటళ్లు, రెండు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను ఓబెరాయ్‌, హయాత్‌ వంటి సంస్థలతో కలిసి అన్నవరం, గండికోట, విజయవాడ, మధురవాడ శిల్పారామంలో పీపీపీ పద్ధతిన నిర్మించనున్నట్టు తెలిపారు. అలాగే ప్రస్తుతం టూరిజం ఆధీనంలో ఉన్న హరితా రిసార్ట్స్‌ ఆధునికీకరణ పనులు చేపడుతున్నామన్నారు. పోర్టులో క్రూయిజ్‌ టెర్మినల్‌ను వచ్చే ఏడాది డిసెంబరులో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నౌక యజమాని గిల్‌ మాట్లాడుతూ నౌకతో పాటు బయట  ప్రాంగణం అభివృద్ధికి రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ నెల 4న వీఎంఆర్‌డీఏ చిల్ట్రన్స్‌ ఎరీనాలో ప్రముఖ గాయకుడు ఘంటశాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. 

Advertisement
Advertisement