Advertisement
Advertisement
Abn logo
Advertisement

చివర్లో అదరగొట్టిన పూరన్.. విండీస్ గౌరవప్రదమైన స్కోరు

షార్జా: నికోలస్ పూరన్ 22 బంతుల్లో ఫోర్, నాలుగు సిక్సర్లతో 40 పరుగులు, జాసన్ హోల్డర్ 5 బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులకు తోడు తొలుత రోస్టన్ చేజ్ 39 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఆదిలోనే కష్టాలు ఎదుర్కొంది. బంగ్లా బౌలర్లను ఎదుర్కోలేక విండీస్ టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు.


క్రిస్‌గేల్ (4), ఎవిన్ లూయిస్ (6), హెట్మెయిర్ (9), బ్రావో (1) వంటి ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. పూరన్ మాత్రం పూనకం వచ్చినట్టు ఆడాడు. 22 బంతుల్లోనే ఫోర్, 4  సిక్సర్లతో 40 పరుగులు చేయగా, జాసన్ హోల్డర్ చివర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో మసన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఇస్లామ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

Advertisement
Advertisement