బాంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త లాక్ డౌన్!

ABN , First Publish Date - 2021-04-03T23:48:07+05:30 IST

బాంగ్లాదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌కు సిద్ధమైంది. వచ్చే వారం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

బాంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త లాక్ డౌన్!

ఢాకా: బాంగ్లాదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌కు సిద్ధమైంది. వచ్చే వారం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్  రోడ్డు రవాణా శాఖా మంత్రి ఒబైదుల్ ఖాదెర్ ఆదివారం నాడు ప్రకటించారు. అయితే.. అత్యవసర సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని ఆయన పేర్కొన్నారు. కీలక ఫ్యాక్టరీలు కూడా తెరిచే ఉంటాయని, కార్మికులు కరోనా నిబంధనలను అనుసరిస్తూ షిఫ్టుల ప్రకారం విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌లో శుక్రవారం నాడు కొత్త 6830 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా లెక్కల ప్రకారం.. అక్కడి మొత్తం కేసుల సంఖ్య 624594. దేశంలో కరోనా విజృంభిస్తోందన్న అంచనాకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యాధి కట్టడి కోసం లాక్‌డౌన్ విధించకతప్పదనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. 

Updated Date - 2021-04-03T23:48:07+05:30 IST