లిటన్‌, తమీమ్‌ మెరుపు సెంచరీలు

ABN , First Publish Date - 2020-03-07T10:43:05+05:30 IST

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సను బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీ్‌ప చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 123 పరుగుల....

లిటన్‌, తమీమ్‌ మెరుపు సెంచరీలు

మూడో వన్డేలో బంగ్లా రికార్డుల మోత 

 జింబ్వాబేతో సిరీస్‌ క్లీన్‌స్వీప్

సిల్హట్‌: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సను బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీ్‌ప చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 123 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో ఘన విజయం సాధించింది. వర్షంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. తొలుత బంగ్లాదేశ్‌ 43 ఓవర్లలో 3 వికెట్లకు 322 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (143 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 176), తమీమ్‌ ఇక్బాల్‌ (109 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కి రికార్డుల మోత మోగించారు. దాస్‌, తమీమ్‌ తొలి వికెట్‌కు ఏకంగా 292 పరుగులు జత చేశారు. వన్డేల్లో ఏ వికెట్‌కైనా బంగ్లాదేశ్‌కు ఇది అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం. ఇక.. శతకాలు బాదిన బంగ్లా తొలి ఓపెనింగ్‌ జోడీగా వారు రికార్డుకెక్కారు. ఈ సిరీస్‌లో లిటన్‌, ఇక్బాల్‌కు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. అలాగే వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌గా లిటన్‌ మరో రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో గత మ్యాచ్‌లో తమీమ్‌ ఇక్బాల్‌ (158) నెలకొల్పిన రికార్డును దాస్‌ బద్దలుగొట్టాడు. ఇంకా.. రెండో వన్డేలో జింబాబ్వేపై చేసిన అత్యధిక రన్స్‌ రికార్డును కూడా బంగ్లా సమం చేసింది. ఆపై జింబాబ్వే లక్ష్యాన్ని 43 ఓవర్లలో 342 రన్స్‌గా నిర్ధారించారు. కానీ.. ఛేదనలో జింబాబ్వే 37.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. 

Updated Date - 2020-03-07T10:43:05+05:30 IST