ఫేస్‌బుక్ ‘హాహా’ ఎమోజీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ మతాధికారి ఫత్వా

ABN , First Publish Date - 2021-06-24T15:28:22+05:30 IST

ఫేస్‌బుక్ ‘హాహా’ ఎమోజీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ మతాధికారి ఫత్వా జారీ చేశారు....

ఫేస్‌బుక్ ‘హాహా’ ఎమోజీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ మతాధికారి ఫత్వా

ఢాకా (బంగ్లాదేశ్): ఫేస్‌బుక్ ‘హాహా’ ఎమోజీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ మతాధికారి ఫత్వా జారీ చేశారు. ఫేస్‌బుక్ పేజీలో ప్రజలను అపహాస్యం చేయడానికి హాహా ఎమోజీని ఉపయోగిస్తున్న వ్యక్తులపై బంగ్లాదేశ్ ప్రముఖ మతాధికారి అహ్మదుల్లా ఫత్వా జారీ చేశారు.ఈ ఫత్వా జారీ చేసిన మతాధికారి అహ్మదుల్లాకు ఫేస్‌బుక్, యూట్యూబ్ లలో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్ లో మతపరమైన సమస్యలపై చర్చించడానికి టెలివిజన్ షోలలో అహ్మదుల్లా క్రమం తప్పకుండా కనిపిస్తుంటారు.


ఫేస్‌బుక్ లో ప్రజలను ఎగతాళి చేయడం గురించి అహ్మదుల్లా చర్చించారు. ఇస్లామిక్ శాసనం అయిన ఫత్వా జారీతో ఫేస్‌బుక్ లో హాహా ఎమోజీని పూర్తిగా నిషేధించామని 3 నిమిషాల వీడియోను పోస్టు చేశారు. ఫేస్‌బుక్ లో ఎగతాళి చేయడం ఇస్లాంలో పూర్తిగా నిషేధించబడిందని అహ్మదుల్లా చెప్పారు.ఈ ఫత్వాపై వేలాదిమంది అనుచరులు సానుకూలంగా స్పందించారు. 

Updated Date - 2021-06-24T15:28:22+05:30 IST