నెలాఖరులోగా బంజారా, ఆదివాసీ భవన్‌లు

ABN , First Publish Date - 2021-04-09T08:34:25+05:30 IST

బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకలుగా నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న భవనాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గిరిజన, స్ర్తీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

నెలాఖరులోగా బంజారా, ఆదివాసీ భవన్‌లు

బంజారాలు, ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకలుగా నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న భవనాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గిరిజన, స్ర్తీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌  అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌  చేతులు మీదుగా ఈ భవనాలను ప్రారంభించుకునే విధంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. బంజారా భవన్‌, ఆదివాసీ భవన్‌ల నిర్మాణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. కాగా, బాలికలకు రుతుస్రావం పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వపరంగా సాయం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహిళల్లో నెలసరిలో వచ్చే మార్పులపై అవగాహనా కార్యక్రమాలను చేపట్టిన ప్యూర్‌ సంస్థ ప్రతినిధి సంధ్య గొల్లమూడిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ప్యూర్‌ ఫెమ్మే హైజిన్‌ వ్యాన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 

Updated Date - 2021-04-09T08:34:25+05:30 IST