ఇఎమ్‌ఐ వాయిదా ఇచ్చినట్టే ఇచ్చి...

ABN , First Publish Date - 2020-04-03T01:29:25+05:30 IST

ఏంట్రా బాబ్జీ ఈ కరోనా ఇలా వచ్చి పడింది? ఇల్లు కదలడానికి లేదు. కనీసం ఇఎమ్‌ఐ కట్టడానికి లేదు.

ఇఎమ్‌ఐ వాయిదా ఇచ్చినట్టే ఇచ్చి...

టెక్‌ టాక్‌ : ఇఎమ్‌ఐ వాయిదా ఇచ్చినట్టే ఇచ్చి...

( రాంజీ, బాబ్జీ టెక్‌ డిస్కషన్‌ )


రాంజీ : ఏంట్రా బాబ్జీ ఈ కరోనా ఇలా వచ్చి పడింది? ఇల్లు కదలడానికి లేదు. కనీసం ఇఎమ్‌ఐ కట్టడానికి లేదు.

బాబ్జీ : అవున్రా బాబూ. ఎవడికి వాడు ఇదో అవకాశంగా తీసుకుని జీతాల్లో కోత వేసేస్తున్నాట్ట. మరి ఇఎమ్‌ఐలు ఎలా కడతాం?


రాంజీ : ఏమైనా పాపం ఆర్బీఐ వాళ్లు జనం మీద దయతలచి ఓ మూణ్ణెల్ల పాటు మారటోరియం పెట్టారు. ఆ ఇఎమ్‌ఐ లు క్యాన్సిల్‌ చేశారు.

బాబ్జీ : క్యాన్సిల్‌ కాదురా బాబూ. వాయిదా వేశారంతే! ఎప్పటికైనా కట్టాల్సిందే!


రాంజీ : పోన్లే అదేనా చేశారు కదా?

బాబ్జీ : అవున్లే. కనీసం మూడు నెలలపాటు బ్యాంకుల వాళ్లు మనని పీడించకుండా ఉంటార్లే.


రాంజీ : పీడించడం అంటావేంట్రా? మనం కట్టాల్సిన డబ్బే కదా అది?

బాబ్జీ : బావుంది. ఆ కార్డు తీసుకో. ఈ లోన్‌ తీసుకో అని రోజుకి ముప్ఫై కాల్స్‌ చేసి రెచ్చగొడతారు. మనని ముగ్గులోకి దింపి లోన్లూ కార్డులూ అంటగడతారు. ఆ తరవాత కట్టలేకపోతే గోదాట్లోకి దింపుతారు. కట్టకపోతే మనకి ఫైన్లుంటాయ్‌. మరి మనని ఇలా రెచ్చగొట్టినందుకు బ్యాంకులోళ్లకి శిక్షలుండవా? ఇదేం న్యాయం?


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )

రాంజీ : పోన్లేరా. మూణ్ణెల్లయినా ఆప్షనుంది కదా?

బాబ్జీ : ఏం మూణ్ణెల్లు? ఏప్రిల్ మే జూన్‌ కాదట.. మార్చి ఒకటి నుంచీ లెక్కలోకి తీసుకుని మే తో క్లోజ్‌ చేసేస్తున్నాయ్‌ కొన్ని బ్యాంకులు.


రాంజీ : అదేంట్రా? అసలు కరోనా గొడవ వచ్చిందే మార్చి చివర్లో... మార్చి ఒకటి ఎలా పెడతారు మారటోరియం?

బాబ్జీ : అదే మరి బ్యాంకోడి మాయ అంటే! ఇంకా ఇదేం చూశావ్‌? ఇఎమ్‌ఐ వాయిదా వేసుకుని మారటోరియం ఆప్షన్‌ తీసుకోవాలంటే మనం వెళ్లి అడుక్కోవాలి. లేకపోతే మామూలు బిల్లులే పడిపోతాయ్‌.


రాంజీ : అయ్యబాబోయ్‌ అదేంట్రా? ఆటోమేటిగ్గా అందరికీ ఇచ్చేయరా?

బాబ్జీ : ఇంకా దరిద్రం ఏంటంటే... వాయిదా కోసం ఎప్లై చేసే లింకులేవీ సరిగ్గా పనిచేయడం లేదు.


రాంజీ : అవును మరి. అందరూ ఒకేసారి క్లిక్‌ చేసేసరికి … ట్రాఫిక్‌ పెరిగి...

బాబ్జీ : ఒకవేళ నువ్వు ఇఎమ్‌ఐ వాయిదా అవకాశం పొందినా.. వడ్డీలు మాత్రం యథావిధిగా పడిపోతాయ్‌ తెలుసా?


రాంజీ : ఇదేం దారుణంగా? ఆపత్సమయంలో్ జనాన్ని ఆదుకోవాలి గానీ...

బాబ్జీ : ఆదుకోవడం కాదు. మనని దోచడానికి ఇదో అవకాశం వాళ్లకి... దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడంటే ఇదే మరి! అసలు మన బ్యాంకులు ఎలాంటివో చెప్పనా? నీ దగ్గర డబ్బులున్నంతకాలం ఏదోలా లాగేస్తాయి. నీకు అవసరమైనప్పుడు మాత్రం చచ్చినా హెల్ప్‌ చెయ్యవు.


రాంజీ : ఛత్‌. మరి ఇలాంటి బ్యాంకుల వల్ల ఎవడికిరా లాభం?

బాబ్జీ : ఎవడికా? విజయ్‌మాల్యాకి కాల్‌ చేసి అడుగు. చెబుతాడు. అసలు మన కలికాలం బ్యాంకింగ్‌ ఇంత కఠోరంగా ఉండబట్టే... కరోనా వైరస్‌లొచ్చి దేశాన్ని కకావికలం చేసేస్తున్నాయ్‌.


రాంజీ : (ఎక్స్‌ప్రెషన్‌ )



Updated Date - 2020-04-03T01:29:25+05:30 IST