దివ్య హత్య కేసులో... కీలక మలుపు

ABN , First Publish Date - 2020-02-20T23:26:02+05:30 IST

బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు వెంకటేశ్‌ను 5 స్పెషల్ టీమ్‌లు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని గజ్వేల్ పోలీసు స్టేషన్‌కు

దివ్య హత్య కేసులో... కీలక మలుపు

గజ్వేల్‌: బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు వెంకటేశ్‌ను 5 స్పెషల్ టీమ్‌లు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని గజ్వేల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దివ్యను హత్య చేసినట్లు విచారణలో వెంకటేశ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దివ్యపై దాడి చేసిన తర్వాత  వెంకటేశ్ విజయవాడకు పారిపోయాడన్నారు. దివ్యను వెంకటేశ్ ప్రేమ పేరుతో వేధించాడని చెప్పారు. ఇదే సమయంలో వేరే అబ్బాయితో దివ్య చనువుగా ఉంటుందన్న కారణంతో ఆమెపై వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడన్నారు. డాబాపై ఉన్న దివ్యపై వెంకటేశ్ కత్తితో దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు.


నిందితుడు వెంకటేశ్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడ్ని సంగారెడ్డి జైలుకు తరలించారు.

Updated Date - 2020-02-20T23:26:02+05:30 IST