వీధివ్యాపారులకు బ్యాంక్‌ రుణాలు

ABN , First Publish Date - 2020-06-04T09:31:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మానిర్భర్‌’ ద్వారా వీధివ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు

వీధివ్యాపారులకు బ్యాంక్‌ రుణాలు

ఖమ్మం కార్పొరేషన్‌,జూన్‌3: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మానిర్భర్‌’ ద్వారా వీధివ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌, మెప్మా పీడీ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. బుధవారం మెప్మా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పధకం అమలుచేస్తున్నారన్నారు.


మెప్మా కార్యాలయంలో రిజిస్త్రేషన్‌ చేయించుకొని, గుర్తింపు కార్డు ఉన్న వీధివ్యాపారులు రుణాలు పొందేందుకు అర్హులని మెప్మా పీడీ పేర్కొన్నారు. రూ.150 రిజిస్త్రేషన్‌ ఫీజు కింద మెప్మా కార్యాలయంలో చెల్లించాలని సూచించారు. నమోదు చేయించుకున్న వీధివ్యాపారులందరికీ గుర్తింపుకార్డులు మెప్మా అధికారులను అనురాగ్‌జయంతి ఆదేశించారు.  అర్హులైన వారి జాబితా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, మెప్మా డీఎంసీ సుజాత, న్యాయవాది నరేంద్రస్వరూప్‌,   టౌన్‌ప్లానింగ్‌, ట్రాఫిక్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T09:31:29+05:30 IST