Bank of Baroda పండుగ సీజన్ ఆఫర్

ABN , First Publish Date - 2021-09-16T23:46:07+05:30 IST

Bank of Baroda పండుగ సీజన్ ఆఫర్

Bank of Baroda పండుగ సీజన్ ఆఫర్

హైదరాబాద్: పండుగ సీజన్ సందర్భంగా తమ వినియోగదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్‌కు ముందు రిటైల్ లోన్ ఆఫర్‌లను ప్రకటించింది. గృహ రుణాలు, కారు రుణాలను అందిస్తోన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. హోమ్ లోన్ మరియు కార్ లోన్ ప్రొడక్ట్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది, ఇందులో బ్యాంక్ అంతటా ఉన్న బరోడా హోమ్ లోన్స్ మరియు బరోడా కార్ లోన్‌లకు వర్తించే రేట్లలో 0.25% మాఫీని ఆఫర్ చేస్తుంది. అదనంగా బ్యాంక్ గృహ రుణాలలో ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపును కూడా అందిస్తోంది. ఇప్పుడు గృహ రుణ రేట్లు 6.75% మరియు కార్ లోన్ రేట్లు 7.00% నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.

Updated Date - 2021-09-16T23:46:07+05:30 IST