బ్యాంక్ ఆఫ్ బరోడా + వన్‌కార్డ్‌... కొత్త క్రెడిట్ కార్డు...

ABN , First Publish Date - 2021-11-26T22:24:25+05:30 IST

బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) నుంచి మరో క్రెడిట్ కార్డు రాబోతోంది. బీఓబీ అనుబంధ సంస్థ బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్... వన్‌కార్డ్‌తో కలిసి కో-బ్రాండెడ్ మొబైల్ ఫస్ట్ క్రెడిట్ కార్డు జారీ చేయనుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా + వన్‌కార్డ్‌... కొత్త క్రెడిట్ కార్డు...

హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) నుంచి మరో క్రెడిట్ కార్డు రాబోతోంది. బీఓబీ అనుబంధ సంస్థ బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్... వన్‌కార్డ్‌తో కలిసి కో-బ్రాండెడ్ మొబైల్ ఫస్ట్ క్రెడిట్ కార్డు జారీ చేయనుంది. కాగా... యువత, టెక్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్డులు అందుబాటులోకి తీసుకురానున్నారు. బీఓబీ  క్రెడిట్ కార్డుల జారీతోపాటు వాటి నిర్వహణ వ్యవహారాలను బీఎఫ్‌ఎస్‌ఎల్  పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయంగా చెల్లుబాటు కాగల వన్ కార్డుతో కలిసి జారీ చేస్తోన్న ఈ క్రెడిట్ కార్డుతో బీఓబీ ఖాతాదారుల డిపాజిట్ చెల్లింపులు సులభతరమవుతాయి. మొబైల్ యాప్ ఆధారంగా వన్‌కార్డు పని చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డుపై పూర్తి నియంత్రణ ఉండేలా చర్యలు చేపడుతోంది. వ్యయంపై రివార్డ్ పాయింట్లు, చెల్లింపులపై డిజిటల్ సౌకర్యాలను అందించనున్నారు. 


ఆ ఖాతాదారుల కోసం... 

యువత కోసం, సాంకేతిక పరిజ్ఞానమున్న ఖాతాదారుల కోసం బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ... కో-బ్రాండెడ్ మొబైల్ ఫస్ట్ క్రెడిట్ కార్డులను ప్రారంభించేందుకు వన్‌కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా చెల్లుబాటయ్యే క్రెడిట్ కార్డులు బీఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి జారీ కానున్నాయి. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫామ్‌లో వన్‌కార్డ్ ద్వారా నిర్వహణ ఉంటుంది. వన్‌కార్డు వినియోగదారులకు క్రెడిట్ కార్డ్ పై పూర్తి నియంత్రణను అందిస్తుంది. ఖర్చులు, రివార్డ్స్, పరిమితులు, చెల్లింపులు మరెన్నో ఎండ్ టు ఎండ్ డిజిటల్ అనుభవాన్నందిస్తోంది. బీఎఫ్‌ఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శైలేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కంపెనీ ప్రస్తుతం ట్రాన్సాఫార్మేషన్ జర్నీలో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అత్యుత్తమ క్రెడిట్ కార్డ్ సర్వీసును అందించే క్రమంలో... టెక్నాలజీ సహా ఇతరత్రా ప్రక్రియలపై ద‌ృష్టి కేంద్రీకరించినట్లు వెల్లడించారు. 

Updated Date - 2021-11-26T22:24:25+05:30 IST