బ్యాంకర్లు రైతులను ఇబ్బందిపెట్టొద్దు

ABN , First Publish Date - 2021-06-20T04:47:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్న రైతుబంధు డబ్బులను రైతులకు ఇవ్వడంలో బ్యాంకు అధికారులు ఇబ్బం ది పెట్టొద్దని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

బ్యాంకర్లు రైతులను ఇబ్బందిపెట్టొద్దు
బ్యాంక్‌ మేనేజర్‌తో మాట్లాడుతున్న వంశీకృష్ణ

లింగాల, జూన్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తున్న రైతుబంధు డబ్బులను రైతులకు ఇవ్వడంలో బ్యాంకు అధికారులు ఇబ్బం ది పెట్టొద్దని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌ బీఐ దగ్గర ఉన్న రైతులతో శనివారం ఆయన మాట్లాడారు. తమ ఖాతాల నుంచిడబ్బులు తీయ కుండా బ్యాంక్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. అనంతరం ఆ యన బ్యాంక్‌ మేనేజర్‌తో మాట్లాడారు. తమ ఖాతాలలోని డబ్బులను తీసుకోకుండా ఖాతాలను నిలుపుదల చేయడం ఏమిటని బ్యాంకు మేనేజర్‌ ను ప్రశ్నించారు. దీనిని కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని  అన్నారు. అనంతరం స్థానిక పీ హెచ్‌సీకి వెళ్లిన ఆయన కరోనా వ్యాక్సినేషన్‌ గురిం చి తెలుసుకున్నారు. అనంతరం కరోనా బారిన పడిన వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ, నాయకులు లక్ష్మణ్‌నాయక్‌, కో ఆప్షన్‌ సభ్యుడు షఫీ, నిరంజన్‌, వెంకటయ్యగౌడు ఉన్నారు.

 పంట పెట్టుబడిని బకాయిల కింద జమ చేయొద్దు

-బీజేవైఎం జిల్లా కార్యదర్శి గువ్వలి వెంకటయ్య

పెద్దకొత్తపల్లి, జూన్‌ 19 : బ్యాంక్‌ అధికారులు రైతుబంధు డబ్బులను రుణ బకాయిల కింద జమ చేయవద్దని కోరుతూ శనివారం కల్వకోల్‌లో ని ఏపీ జీవీబీ బ్యాంక్‌ మేనేజర్‌కు బీజేవైఎం ఆధ్వ ర్యంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సంద ర్భంగా బీజేవైఎం జిల్లా కార్యదర్శి గువ్వలి వెంకట య్య  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం రైతుల రు ణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో బకా యిలు చెల్లించలేదని. రైతు ఖాతాల్లో జమ చేసిన డబ్బును బ్యాంక్‌ అధికారులు రుణం కింద వసూ లు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌ వెంట నే రుణ మాఫీ డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో బీజే వైఎం మండల అధ్యక్షుడు మల్లేష్‌, నాయకులు ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌, అభిలాష్‌ ఉన్నారు. 



Updated Date - 2021-06-20T04:47:07+05:30 IST