Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్యాంకింగ్... రేపటి నుంచి కొత్త నిబంధనలు

హైదరాబాద్ : రేపటి(మంగళవారం) నుంచి బ్యాంకింగ్‌, ఇతర అంశాల్లో నిబంధనలు మారనున్నాయి. ఈ నిబంధనలకు ంబంధించిన సమాచారాన్ని ఆయా బ్యాంకులు, శాఖలు కొద్ది రోజుల క్రితమే ప్రజలకు సమాచారాన్నిచ్చాయి. ఇక ఆ వివరాలిలా ఉన్నాయి...


కెనరా బ్యాంక్‌ కస్టమర్లకు...

సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సి కోడ్లు జూన్‌ 30 తర్వాత పని చేయవు. జూలై 1 నుంచి కెనరా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌ కోడ్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా...

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకు నిబంధనలు కూడా మారనున్నాయి. ఈ నిబంధనలు రేపటి(జూన్‌ 1) నుంచి అమలులోకి రానున్నాయి. చెక్‌ పేమెంట్స్‌కు సంబంధించి నిబంధనలు మారబోతున్నాయి. రీ కన్ఫర్మేషన్‌ అందించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్‌ మీ చెక్‌ను క్లియర్‌ చేయదు.


గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు...

గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారు కూడా గుర్తించుకోవాల్సిన విషయం... కేంద్రం ప్రతి నెలా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సవరిస్తూ ఉంటుంది. ఈసారి కూడా జూన్‌ 1 నుంచి సిలిండర్‌ ధరలు మారే అవకాశం ఉంటుంది. లేదంటే స్థిరంగా కొనసాగే అవకాశం కూడా ఉంది.


ఆదాయపు పన్ను కోసం కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌..

ఆదాయపు పన్నుకు సంబంధించిన ఈ-ఫైలింగ్‌ వెబ్‌‌సైట్‌ జూన్‌ 1 నుంచి 6 వ తేదీ వరకు మూసివేయబడుతుంది. ఆ తర్వాత... జూన్‌ 7 న, పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త  ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ అందుబాటులోకి రానుంది.

Advertisement
Advertisement