నవంబరు నెలలో బ్యాంకులకు 8 రోజుల సెలవులు

ABN , First Publish Date - 2020-10-30T13:01:25+05:30 IST

దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8 రోజుల పాటు మూసివేయనున్నారు....

నవంబరు నెలలో బ్యాంకులకు 8 రోజుల సెలవులు

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8 రోజుల పాటు మూసివేయనున్నారు. పబ్లిక్ హాలిడేలతోపాటు పండుగల సందర్భంగా బ్యాంకులకు 8 రోజులపాటు సెలవులు ప్రకటించారు. దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబరు నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నవంబరు నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు రావడంతో బ్యాంకులకు సెలవు. దీంతోపాటు దీపావళి, గురునానక్ జయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. నవంబరు నెలలో బ్యాంకులు 8 రోజులు పనిచేయవని, అందువల్ల ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.

Updated Date - 2020-10-30T13:01:25+05:30 IST