Abn logo
Sep 28 2021 @ 00:36AM

తొలి, మలిదశ ఉద్యమాల్లో బాపూజీది కీలకపాత్ర

కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 27: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన తొలి, మలిదశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కీలకపాత్ర పోషించారని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. సోమవారం కొండా లక్ష్మణ్‌ బాపూజీ చౌక్‌ వద్ద ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ భువనగిరి నియోజక వర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తి అని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నటరాజ్‌, డీబీసీడబ్ల్యూవో రాజలింగం, మాజీ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, నాయకులు శ్రీనివాస్‌, బీసీ సంఘం నాయకులు ప్రమోద్‌కుమార్‌ఖత్రి, దత్తు, పార్థసారథి, ప్రమోద్‌ తదితరులున్నారు.

నేరడిగొండ: మండలంలో కొండా లక్ష్మణ్‌ బాపుజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్‌ సమద్‌, సూపరింటెండెంట్‌ చక్రపాణి జూనియర్‌ ఆసిస్టెంట్‌ నారాయణ్‌సింగ్‌ సిబ్బంది ఉన్నారు. 

బజార్‌హత్నూర్‌: మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాల యంలో జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దుర్గం శంకర్‌, వైస్‌ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్‌, ఏపీవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ పుష్ప, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

ఉట్నూర్‌: మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కొండా లక్ష్మణ్‌ బాపుజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ బాలాజీల ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. సూపరింటెండెంట్‌తో పాటు ఉద్యోగులు, లక్కారం సర్పంచ్‌ జనార్దన్‌ రాథోడ్‌, పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాపఊజీ జయంతిలో రైతు కమిటీ అధ్యక్షుడు అజిమొద్దీన్‌, సెడ్మాకి సీతారాం, దాసండ్ల ప్రభాకర్‌, ధరణీరాజేష్‌, సాడిగే రాజ్‌కుమార్‌, లతీఫ్‌, సతీష్‌, జూబేర్‌, స్వామి, కొల సత్తన్న, బెరిగెడి మనోహర్‌, తదితరులు పాల్గొన్నారు.

బోథ్‌: భారత స్వాతంత్య్ర పోరాటంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ ముందుండి ఉద్యమానికి ఊపిరి పోశారని ఎంపీడీవో రాధ, వైస్‌ ఎంపీపీ లింబాజిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుర్మె మహేందర్‌, షేక్‌ రజియాబేగం, చట్లరజిని ఉమేష్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మార్కండేయ ఆలయ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరుగు భోజన్న, కిష్టయ్య, గంగుల మల్లేష్‌, వి.సురేందర్‌, జె.వెంకటేశ్‌, టి.రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

బోథ్‌రూరల్‌: తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మండలంలోని దన్నూర్‌ గ్రామంలో పద్మశాలి భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇట్ల నారాయణ, దోపటిరవీందర్‌, జిట్టనర్సయ్య, రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.