బక్వీట్‌ దోశ

ABN , First Publish Date - 2021-01-23T18:43:35+05:30 IST

బక్వీట్‌ (గోధుమల్లో ఒక రకం) పిండి - రెండు కప్పులు, నల్ల మినుములు - అరకప్పు, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - ఒక

బక్వీట్‌ దోశ

కావలసినవి: బక్వీట్‌ (గోధుమల్లో ఒక రకం) పిండి - రెండు కప్పులు, నల్ల మినుములు - అరకప్పు, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట.


తయారీ విధానం: ముందుగా నల్లమినుములను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి చిటపట అన్న తరువాత పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో బక్వీట్‌ పిండి తీసుకుని అందులో మినుముల పొడి, బియ్యప్పిండి, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలపాలి. తరువాత వేగించిన ఆవాలు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, అటు పలుచగా కాకుండా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె రాసి దోశ పోసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. వేడి వేడి దోశలను చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-01-23T18:43:35+05:30 IST