Advertisement
Advertisement
Abn logo
Advertisement

గణతంత్ర దేశంగా బార్బడోస్

రవి అస్తమించని రాజ్యమని బ్రిటన్‌ని అంటుంటారు. కారణం.. ప్రపంచంలోని చాలా ప్రాంతాన్ని బ్రిటన్ ఏలింది. కాల క్రమంలో అనేక రాజ్యాలకు స్వతంత్రాన్ని ఇచ్చి వదిలేసినప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ బ్రిటన్ చేతిలోనే ఉన్నాయి. బ్రిటన్ రాణే వాటిపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటూ వస్తున్నారు. కాగా, తాజాగా మరో చిన్న దేశం బ్రిటన్ నుంచి విముక్తి పొందింది. సుమారు 400 ఏళ్ల తర్వాత బ్రిటన్ రాణిని తమ దేశాధినేతగా వదిలేసి మొట్టమొదటి సారి తమ అధినేతను ఎన్నుకుంది. అందే కరీబియన్ దీవుల్లో ఒకటైన బార్బడోస్.


బార్బడోస్‌ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ రాజ్యానికి అధినేతగా సండ్ర మసోన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రిన్స్ చార్లెస్, పాప్ సింగర్ రిహన్నా అతిథులుగా హాజరయ్యారు. అర్థరాత్రి బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌డౌన్‌లో వందలాది మంది ప్రజల కరతాల ధ్వనుల మధ్య బార్బడోస్‌కు గణతంత్రాన్ని ప్రకటించారు. అక్కడి క్రౌడ్ హీరోస్ స్క్వేర్ ప్రాంతంలో బార్బడోస్ జెండా స్వతంత్రగా ఎగురుతుంటే సదర్వంగా 21 తుపాకులు వందనంగా గాలిలో తూటాలతో శబ్దాలు చేశాయి.


ప్రమాణ స్వీకారం అనంతరం మసోన్ మాట్లాడుతూ ‘‘గణతంత్ర బార్బడోస్‌ ప్రజలుగా మన దేశానికి మనం గొప్ప స్ఫూర్తిని అందించాలి. రాబోయే తరాలకు గొప్ప భవిష్యత్‌‌ను అందించాలి. ఈ దేశానికి మనమంతా వెన్నెముకలా నిలబడాలి. మనం బార్బడోస్ ప్రజలం’’ అని అన్నారు.

Advertisement
Advertisement