‘బారిసిటినిబ్‌’ తయారీకి మరో హైదరాబాద్‌ కంపెనీ ఒప్పందం

ABN , First Publish Date - 2021-05-14T05:39:27+05:30 IST

కొవిడ్‌ ఔషధం బారిసిటినిబ్‌ తయారీ, మార్కెటింగ్‌కు అమెరికా కంపెనీ ఎలీ లిల్లీతో హైదరాబాద్‌కు చెందిన ఎంఎ్‌సఎన్‌ లాబ్స్‌ రాయల్టీ ఫ్రీ, నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌...

‘బారిసిటినిబ్‌’ తయారీకి మరో హైదరాబాద్‌ కంపెనీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ ఔషధం బారిసిటినిబ్‌ తయారీ, మార్కెటింగ్‌కు అమెరికా కంపెనీ ఎలీ లిల్లీతో హైదరాబాద్‌కు చెందిన ఎంఎ్‌సఎన్‌ లాబ్స్‌ రాయల్టీ ఫ్రీ, నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌, వాలంటరీ లైసెన్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  దేశంలో తక్కువ ధరకు బారిసిటినిబ్‌ ఔషధాన్ని అందించడానికి, సరఫరాను పెంచడానికి ఎలీ లిల్లీతో కుదుర్చుకున్న ఒప్పందం దోహదం చేయగలదని ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంఎ్‌సఎన్‌ రెడ్డి తెలిపారు. 2, 4 ఎంజీల మోతాదులో ‘బారిడోజ్‌’ బ్రాండ్‌తో బారిసిటినిబ్‌ టాబ్లెట్లను ఎంఎ్‌సఎన్‌ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 

Updated Date - 2021-05-14T05:39:27+05:30 IST