వైరా మునిసిపాలిటీలో రెండు బార్లకు అనుమతి

ABN , First Publish Date - 2021-01-26T05:40:44+05:30 IST

మూడేళ్ల కిందట ఏర్పడిన ఖమ్మంజిల్లా వైరా మునిసిపాలిటీలో రెండు బార్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

వైరా మునిసిపాలిటీలో రెండు బార్లకు అనుమతి

వైరా, జనవరి 25: మూడేళ్ల కిందట ఏర్పడిన ఖమ్మంజిల్లా వైరా మునిసిపాలిటీలో రెండు బార్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆమేరకు సోమవారం జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సోమిరెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీలో (159)2బీ బార్లకు రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఆఉత్తర్వుల మేరకు ఖమ్మంజిల్లా వైరా మునిసిపాలిటీలో రెండు బార్ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం మొదలైంది. ఫిబ్రవరి 8వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 10న ఖమ్మం టీటీడీసీ భవనంలో వచ్చిన దరఖాస్తులను డ్రాపద్దతిలో ఎంపిక చేశారు. దరఖాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే సెల్‌ 9440902673, 9440902670, 9440902669, 08742-255277లలో సంప్రదించాలని సూచించారు. 


Updated Date - 2021-01-26T05:40:44+05:30 IST