Abn logo
Oct 17 2021 @ 02:49AM

గుండెపోటుతో యువ క్రికెటర్‌ మృతి

రాజ్‌కోట్‌/అహ్మదాబాద్‌: టీమిండియా అండర్‌-19 మాజీ కెప్టెన్‌, సౌరాష్ట్ర యువ బ్యాటర్‌ అవి బారోత్‌ గుండెపోటుతో మరణించాడు. 29 ఏళ్ల బారోత్‌ శుక్రవారం అస్వస్థతకు గురవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందినట్టు సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం తెలిపింది. 2019-20 సీజన్‌ రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర జట్టులోని సభ్యుడైన బారోత్‌కు తల్లి, భార్య ఉన్నారు. ప్రస్తుతం బారోత్‌ భార్య నాలుగు నెలల గర్భవతి. ప్రతిభావంతుడైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న బారోత్‌..2011లో భారత అండర్‌-19 జట్టు సారథిగా వ్యవహరించాడు. అదే ఏడాది బీసీసీఐ నుంచి అండర్‌-19 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. బారోత్‌ సౌరాష్ట్ర తరఫున 21 రంజీ మ్యాచ్‌లు, 17 లిస్ట్‌-ఎ, 11 దేశవాళీ టీ20 మ్యాచ్‌లు ఆడాడు.