Abn logo
Jan 26 2021 @ 00:29AM

బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

  • ఫిబ్రవరి 8వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

మహేశ్వరం/ఆమనగల్లు: ఎక్సైజ్‌ శాఖ బార్‌ అండ్‌ రెస్టారెంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని జిల్లా ఎక్సైజ్‌ అధికారి రఘురాం, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రాజేష్‌, ఎక్సైజ్‌ సీఐలు వీణారెడ్డి, వేణుకుమార్‌ సోమవారం తెలిపారు. డివిజన్‌లోని జల్పల్లి, ఆదిభట్ల, తుక్కుగూడ, ఆమన్‌గల్‌ మున్సిపాల్టీల్లో బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. జల్పల్లిలో రూ.42లక్షలు, ఆదిభట్ల, తుక్కుగూడ, ఆమనగల్లులో లైసెన్స్‌ కోసం రూ.30లక్షల చొప్పున ఎక్సైజ్‌ టాక్స్‌ చెల్లించాలన్నారు. దరఖాస్తుదారులు 3కలర్‌ పాస్‌ ఫొటోలు, ఆధార్‌, పాన్‌కార్డుల జిరాక్స్‌లు జత చేయాలన్నారు. దరఖాస్తులను నాంపల్లిలోని జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్ర 4గంటల వరకు దరఖాస్తులకు గడువన్నారు. అదనంగా సమాచారం కావాలంటే 9440902310, 9440902309 అనే నెంబర్లలో సంప్రదించాలని తిఆయన వివరించారు.

Advertisement
Advertisement