ఆర్నెల్ల తర్వాత.. తెరుచుకోనున్న బార్‌లు

ABN , First Publish Date - 2020-09-19T18:11:47+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల మార్చి నెల 21న మూత పడిన బార్‌లు త్వరలో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అయితే వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు మాత్రమే బార్‌లు కొనసాగుతాయని, తర్వాత కొనసాగిస్తారా, శాశ్వ తంగా మూసేస్తారా అనేది స్పష్టం చేయలేదు.

ఆర్నెల్ల తర్వాత.. తెరుచుకోనున్న బార్‌లు

వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు తెరుచుకోవచ్చని ఆదేశం

విక్రయాలు, లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌లపై 10 శాతం పెంపు 

కొవిడ్‌ ఫీజుగా బార్‌ లైసెన్స్‌లపై 20 శాతం వసూలు 


కాకినాడ (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వల్ల మార్చి నెల 21న మూత పడిన బార్‌లు త్వరలో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అయితే వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు మాత్రమే బార్‌లు కొనసాగుతాయని, తర్వాత కొనసాగిస్తారా, శాశ్వ తంగా మూసేస్తారా అనేది స్పష్టం చేయలేదు. అయితే ఆదాయం విషయంలో భారీగానే బాదుడు వేసింది. మద్యం విక్రయాలు, లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌ చార్జీలపై 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీం తోపాటు కొవిడ్‌ ఫీజుగా బార్‌ లైసెన్స్‌లపై 20 శాతం వసూలు చేస్తా మని ప్రకటించింది. దీంతో నిర్వాహకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జూన్‌తో బార్‌ లైసెన్స్‌ల రెన్యువల్‌ గడువు ముగిసిందని, ఆర్నెల్లు వ్యాపారంలో నష్టపోయామని, ఇప్పుడు పెరిగిన మద్యం ధరలతో బార్‌లకు మద్యం ప్రియులు వచ్చే అవకాశం ఉండదని కొందరు అంటున్నారు. 


లైసెన్స్‌ ఫీజుతోపాటు, అదనంగా కొవిడ్‌ ఫీజు బాధుడు వల్ల తమకు ఒరిగేదేమీ ఉండదని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే వ్యాపారం మూత పడడంతో చెట్టుకొకరు, పుట్టకొకరు చెదిరిపోయారని, గతంలో జిల్లావ్యాప్తంగా 65 బార్‌లుం డగా, మద్యం కొత్త పాలసీ, మద్య నిషేధంలో భాగంగా 25 మంది తమ బార్‌ల లైసెన్స్‌ను పునరుద్ధరించుకోలేదు. దీంతో ప్రస్తుతం 40 బార్‌లు రన్నింగ్‌లో ఉంటూ కొవిడ్‌ ఆంక్షల్లో మూతపడ్డాయి. ఇందులో స్టార్‌ హోటళ్లలో వేరుగా మరి కొన్ని బార్‌లున్నాయి. వీటిని తెరుస్తా రని, 40 బార్‌ల్లో దాదాపు చితికిపోయిన నిర్వాహకులు 15 మంది ఉంటారని సమాచారం. దీంతో మొత్తం 40 బార్‌లు ఓపెన్‌ చేస్తారా, 25 బార్‌లనే తెరుస్తారా అనేది సందిగ్ధంగా ఉంది.

Updated Date - 2020-09-19T18:11:47+05:30 IST