సెమీ‌స్‌లో బార్టీ, సబలెంక

ABN , First Publish Date - 2021-07-07T06:31:08+05:30 IST

సంచలన రీతిలో ప్రీక్వార్టర్స్‌కు చేరిన బ్రిటన్‌ టీనేజర్‌ ఎమ్మా రడుకాను (18) అనారోగ్య కారణాల రీత్యా ముందంజ వేయలేకపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్‌ టామ్‌లజనోవిచ్‌తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌...

సెమీ‌స్‌లో బార్టీ, సబలెంక

  • ప్లిస్కోవా, కెర్బర్‌ కూడా
  • మెద్వెదెవ్‌కు షాక్‌

లండన్‌: టాప్‌ సీడ్లు ఆష్లే బార్టీ, అరియానా సబలెంక  గ్రాస్‌కోర్ట్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. అన్‌సీడెన్‌ అజ్లా టామ్‌లజనోవిచ్‌ను బార్టీ చిత్తు చేయగా.. ట్యునీషియా ప్లేయర్‌ ఆనస్‌ జెబ్యూర్‌పై సబలెంక అలవోక విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లింది. 19వ సీడ్‌ కరోలినా ముచోవాపై నెగ్గిన మాజీ చాంపియన్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌, తొమ్మిదో ప్రయత్నంలో చెక్‌ భామ కరోలినా ప్లిస్కోవా కూడా ఫైనల్‌-4కు చేరుకున్నారు. ఫైనల్‌ బెర్త్‌ కోసం కెర్బర్‌తో బార్టీ, ప్లిస్కోవాతో సబలెంక తలపడనున్నారు. 


ప్లిస్కోవా ఎట్టకేలకు..: మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్ల మధ్య పోరులో బార్టీ 6-1, 6-3తో అజ్లా టామ్‌లజోవిచ్‌ను వరుస సెట్లలో చిత్తు చేసింది. తొలి సెట్‌ మూడో గేమ్‌లోనే అజ్లా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన బార్టీ..  6-1తో నెగ్గింది. ఇక రెండో సెట్‌లోనూ ఇదే జోరు కొనసాగించిన బార్టీ 6-3తో నెగ్గి సెమీ్‌సకు దూసుకెళ్లింది. రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌) 6-4, 6-3తో 21వ సీడ్‌ జెబ్యూర్‌పై నెగ్గింది. ఎనిమిదిసార్లు ఆడినా ఎప్పుడూ నాలుగో రౌండ్‌ దాటని 8వ సీడ్‌ ప్లిస్కోవా.. ఎట్టకేలకు సెమీస్‌కు చేరుకొంది. ప్లిస్కోవా 6-2, 6-2తో విక్టోరిజా గోలుబిక్‌ (స్విట్జర్లాండ్‌)పై, 25వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ) 6-2, 6-3తో ముచోవాపై గెలిచారు.


అయ్యో.. రడుకాను: సంచలన రీతిలో ప్రీక్వార్టర్స్‌కు చేరిన బ్రిటన్‌ టీనేజర్‌ ఎమ్మా రడుకాను (18) అనారోగ్య కారణాల రీత్యా ముందంజ వేయలేకపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్‌ టామ్‌లజనోవిచ్‌తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో రడుకాను 4-6, 0-3తో వెనుకంజలో ఉన్న సమయంలో రిటైర్డ్‌ హర్ట్‌ అయింది. 


మెద్వెదెవ్‌ ఇంటికి..: రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు ఊహించని షాక్‌ తగిలింది.  నాలుగో రౌండ్‌లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ 6-2, 6-7(2), 6-3, 3-6, 3-6తో 14వ సీడ్‌ హర్కాజ్‌ చేతిలో ఓడాడు. ఆరోసీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ 7-5, 6-4, 6-2తో లొరెంజో సొనెగో (ఇటలీ)ని ఓడించాడు. క్వార్టర్స్‌లో ఫెడెక్స్‌తో హ్యూబర్ట్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. 


Updated Date - 2021-07-07T06:31:08+05:30 IST