నేటితో బొమ్మై పాలనకు 6 నెలలు

ABN , First Publish Date - 2022-01-28T16:29:48+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రికి మహత్తరమైన రోజు ఇది. బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి శుక్రవారంతో ఆరు నెలలు పూర్తవనుంది. మరో ప్రత్యేకతమైన విషయం ఆయన 62వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఓవైపు జన్మదినం

నేటితో బొమ్మై పాలనకు 6 నెలలు

- జన్మదిన వేళ అధిష్ఠానం నుంచి తీపి కబురు..! 

- నాయకత్వ మార్పు యోచనకు బ్రేక్‌

- ప్రభుత్వ విజయాలపై నేడు ప్రత్యేక సంచిక విడుదల


బెంగళూరు: రాష్ట్ర ముఖ్యమంత్రికి మహత్తరమైన రోజు ఇది. బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి శుక్రవారంతో ఆరు నెలలు పూర్తవనుంది. మరో ప్రత్యేకతమైన విషయం ఆయన 62వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఓవైపు జన్మదినం, మరోవైపు ఆరు నెలలపాలన ఒకేరోజు రావడమే కాక ఇటీవల నెలరోజులుగా నాయకత్వ మార్పు అంశంపై సాగుతున్న చర్చలకు అధిష్ఠానం బ్రేక్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా బసవరాజ్‌ బొమ్మైకి మరో తీపి కబురు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయాల కారణంగా యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాక బసవరాజ్‌ బొమ్మై సీఎంగా బాద్యతలు చేపట్టారు. అనూహ్య పరిణామాల మధ్య గద్దెనెక్కిన ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నంచే పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలల్లో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రాకున్నా బిట్‌ కాయిన్‌ అంశం ప్రభుత్వాన్ని కుదిపేసింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో పాలనను మరింత కట్టుదిట్టం చేసేందుకు అధిష్ఠానం సిద్ధమైంది. కేబినెట్‌లో ఖాళీగా ఉండే నాలుగు స్థానాల భర్తీతోపాటు క్రియాశీలకంగా లేని మంత్రులను తప్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరుగురు మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించి కొత్తగా 9మందిని చేర్చుకునేలా అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. మంత్రుల మార్పుకే అధిష్ఠానం అనుమతిచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో ప్రస్తుతానికి వాయిదా వేసి మార్చి రెండోవారం తర్వాత విస్తరణ ఉంటుందనిపిస్తోంది. తొలగింపుల జాబితాలో మురుగేశ్‌ నిరాణి, శశికళ జొల్లె, నారాయణగౌడ, ప్రభు చౌహాన్‌, బీసీ పాటిల్‌ లేదా ఈశ్వరప్పల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆశావహుల్లో మాజీ సీఎం య డియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పేరు కీలకం కాగా బసనగౌడపాటిల్‌ యత్నాళ్‌, రాజీవ్‌, రామదాస్‌, పూర్ణిమా శ్రీనివాస్‌, అరవింద్‌బెల్లద్‌, అరవిందలింబావళి, రవికుమార్‌, రేణుకాచార్యలు ఉన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి, స్థానిక పోరులో అరకొర ఫలితాలు, ఇలా కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుటికీ బొమ్మై తన పాలనను విజయంతంగా నడిపించాడని చెప్పు కోవచ్చు. అలాగే ప్రభుత్వ విజయాలపై. పార్టీ ప్రతిష్ట ను ప్రతిబింబిచేలా 6 నెలల పాలనపై ప్రత్యేక సంచిక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పత్యేక సంచికను విడుదల చేయనున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేసిన పథకాలతోపాటు ముఖ్యమంత్రి నిర్ణయాల ను పుస్తకం ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఓ వైపు జన్మదినం, మరోవైపు ఆరు నెలల పాలనకు సంబంధించి ముఖ్యమంత్రి నివాసం వద్ద అప్పుడే సందడి మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా బొమ్మై జన్మదిన వేడుకలు నిర్వహించడానికి అ భిమానులు, పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-01-28T16:29:48+05:30 IST