సంబురంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-25T07:28:28+05:30 IST

సద్దుల బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా సాగాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు

సంబురంగా సద్దుల బతుకమ్మ

నెక్లెస్‌ రోడ్డు : సద్దుల బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా సాగాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరై గౌరీ పూజ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో రహ్మత్‌నగర్‌లోని నిమ్స్‌ మైదానంలో వేడుకలు నిర్వహించారు.  పీజేఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డు రోటరీ చౌరస్తాలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో తరలివచ్చారు. ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మరో పక్క దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.  మండపాల్లో అమ్మవారు పూజలందుకుంటోంది.  

Updated Date - 2020-10-25T07:28:28+05:30 IST