Abn logo
Oct 17 2021 @ 21:49PM

అమెరికాలో ఘనంగా బతుకమ్మ

వాషింగ్టన్: యూఎస్ఏలోని మేరీల్యాండ్‌లో మోరిస్ ప్లేస్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. ప్రవాస తెలంగాణ, తెలుగు వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. పూవులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు సొంతమని, మాతృభూమికి దూరంగా ఉన్నా ఆ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ముందు ఉంటామని నిర్వాహకులు తెలిపారు. ఏ దేశంలో ఉన్నా ప్రతి పండుగను కలిసి కట్టుగా నిర్వహించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుశీల సామల, తనూజ వీరగంటి, శారద జూలూరి, వేద కట్సురి, వందన మాధవరం తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...