బతుకమ్మ, దసరా తెలంగాణ సంస్కృతికి చిహ్నాలు

ABN , First Publish Date - 2020-10-22T06:04:23+05:30 IST

బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు

బతుకమ్మ, దసరా తెలంగాణ  సంస్కృతికి చిహ్నాలు

ఈసారి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో‘రామ్‌లీలా’

కొవిడ్‌ జాగ్రత్తలను పాటిస్తూ కార్యక్రమాల్లో పాల్గొనాలి 

మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 21: బతుకమ్మ, దసరా పండుగలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలుగా నిలుస్తాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.  ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేస్తున్న నగరపాలక సంస్థ ఈసారి దసరా రోజు అంబేద్కర్‌ స్టేడియంలో రామ్‌లీలా కార్యక్రమాన్ని చేపడుతోందని చెప్పారు. రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంబేద్కర్‌ స్టేడియంలో ఏర్పాట్లను మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టేడియం గ్రౌండ్‌ను చదను చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌ ద్వారా మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ కాంత్రి నేతృత్వంలో దసరా రోజు రావణ దహనం చేయడంతోపాటు బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని తెలుపుతూ లేజర్‌షో, క్రాకర్‌షోను  నిర్వహిస్తామని చెప్పారు. దసరా రోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు కొవిడ్‌ పాటిస్తూ హాజరై విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, మున్సిపల్‌ ఈఈ రామన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చిట్టిమల్ల శ్రీనివాస్‌, చిదుర సురేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T06:04:23+05:30 IST