ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు

ABN , First Publish Date - 2022-09-23T04:06:44+05:30 IST

ప్రతీ ఆడబిడ్డ ఆనందంగా ఉండాలనే సీఎం కేసీ ఆర్‌ బతుకమ్మ పండుగకు కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కన్నెపల్లి, గూడెం, నంబాల, వెల్గనూర్‌, కాసిపేట, కోండాపూర్‌, ద్వారక, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్‌ గ్రామాల్లో గురు వారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు
కన్నెపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు,

 దండేపల్లి, సెప్టెంబరు 22: ప్రతీ ఆడబిడ్డ ఆనందంగా ఉండాలనే సీఎం కేసీ ఆర్‌ బతుకమ్మ పండుగకు కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కన్నెపల్లి, గూడెం, నంబాల, వెల్గనూర్‌, కాసిపేట, కోండాపూర్‌, ద్వారక, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్‌ గ్రామాల్లో గురు వారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ ఆద ర్శంగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో గురువయ్య, లింగన్న, సురేష్‌, అనిల్‌,  శ్రీనివాస్‌, రజిని, పుష్పలత, యశోధ, శాంతయ్య, దేవక్క, మాధవి, సత్తమ్మ. మ ల్లవ్వ, మణేమ్మ, రాజేందర్‌, రవీందర్‌, వెంకటేష్‌, నరేష్‌, సంతోష్‌,  పాల్గొన్నారు.   

మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని మత్స్యకారులు ఆర్థికా భివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. పెద్దపేట పెద్ద చెరువులో లక్షా 26వేల చేప పిల్లలను గురువారం ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వం అందించిన ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారులు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వదేన్నారు. మత్స్య శాఖ ఏడీ సత్యనారాయణ, సర్పంచు మాధవి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఆర్‌బి లస్మయ్య, రాజన్న కోటేష్‌, శంకర్‌, నర్సయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-23T04:06:44+05:30 IST