Jul 23 2021 @ 20:26PM

‘బ‌తుకు బ‌స్టాండ్’ ట్రైల‌ర్: కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది

విరాన్ ముత్తంశెట్టి హీరోగా నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో ఐఎన్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘బ‌తుకు బ‌స్టాండ్’. కవితా రెడ్డి, కె. మాధవి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ మంచి స్పందనను అందుకుంటోంది. విడుద‌లైన ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ద‌ర్శ‌కుడు ఐఎన్ రెడ్డి తెలపగా.. కంటెంట్‌తో పాటు క‌మ‌ర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియెన్స్‌కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చే రీతిన ఈ సినిమాను రూపొందించిన‌ట్లుగా నిర్మాత‌లు ఐ క‌వితా రెడ్డి, కె. మాధ‌వి అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ముగిసింద‌ని, త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాతలు పేర్కొన్నారు. 


‘మౌనంగా ఉంటున్నానని ముని అనుకుంటున్నావేమో.. నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండొచ్చు’’ అని హీరో చెప్పే డైలాగ్‌తో పాటు, ‘నీ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది..’ అని హీరోయిన్ చెప్పే డైలాగ్‌, అలాగే సినిమా టైటిల్‌కు సంబంధించి ట్రైలర్ చివరిలో హీరో చెప్పే ‘‘ప్రతిదానికి మీనింగ్స్ వెతకడానికి ట్రై చేయకువా.. సినిమా చూసి టైటిల్ కరెక్టో కాదో చెప్పు..’’ అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.