Abn logo
Nov 22 2020 @ 13:43PM

బ్యాట్‌మ్యాన్‌ కాంస్య విగ్రహావిష్కరణ

Kaakateeya

హాలీవుడ్‌లో సూపర్‌హీరోస్‌కు ఉండే క్రేజే వేరు. సూపర్‌ మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, హీ మ్యాన్‌, బ్యాట్‌మ్యాన్‌, ఐరన్‌ మ్యాన్‌ ఇలా చాలా మంది సూపర్‌ హీరోల సినిమాలు హాలీవుడ్‌లోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పొందాయి. సూపర్‌హీరోస్‌ను అభిమానించే హాలీవుడ్‌ ప్రేక్షకుల కోసం రీసెంట్‌గా ఆరువందల పౌండ్స్ బరువుండే బ్యాట్ మ్యాన్‌ కాంస్య విగ్రహాన్ని ఇటీవల కాలిఫోర్నియాలోని బర్‌బ్యాంక్ లో ప్రతిష్ఠించారు. 2002లో వచ్చిన కామిక్ బుక్ 'హుష్' లోని డార్క్ నైట్ బ్యాట్స్ మ్యాన్ ఆకారాన్ని ఆధారంగా చేసుకుని ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఏడున్నర అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని డిజిటల్ స్కల్పటర్ అలెజాండ్రో పెరీరా నేతృత్వంలో అమెరికన్ ఫైన్ ఆర్ట్స్ ఫౌండ్రీ అండ్ ఫాబ్రికేషన్ సంస్థ తయారు చేసింది.


Advertisement
Advertisement