Abn logo
May 9 2021 @ 00:00AM

ఆయనకు ముగ్గురు!

అనగనగా ఓ చీరల వ్యాపారి. అతని పేరు రామస్వామి. శ్రీరామచంద్రుడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. అలాగే, వీధుల్లో నగల వ్యాపారం చేసే జయప్రదను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మరో ఇద్దర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న అతని కథేంటో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’లో చూడమని దర్శకుడు రామ్‌ నారాయణ్‌ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 14న ‘జీ 5’ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. రామస్వామిగా అల్తాఫ్‌ హసన్‌, ముగ్గురు కథానాయికలుగా శాంతి రావ్‌, సాత్విక, లావణ్యారెడ్డి నటించారు. ఇదొక న్యూ ఏజ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని నిర్మాతలు సతీశ్‌కుమార్‌ ఐ, రామకృష్ణ వీరపనేని చెప్పారు.