Abn logo
Oct 13 2021 @ 00:00AM

ఊరంతా బతుకమ్మ సందడి!

రోజు సద్దుల బతుకమ్మ. చివరి రోజైన నేడు సద్దుల బతుకమ్మ జరుపుకొంటారు. గునుగు పూలు, తంగేడు పూలు, చామంతి, గుమ్మడి... వంటి పలురకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు. మహిళలందరూ ఒక్కచోట చేరి బతుకమ్మ ఆడుతారు. బతుకమ్మలను నీటిలో వదిలిన తరువాత వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫలహారాలు పంచుకుంటారు.