వైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-24T10:50:14+05:30 IST

పారుపెల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గురువారం రాత్రి వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను సుందరంగా తీర్చిదిద్దారు.

వైభవంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

కోటపల్లి, అక్టోబరు 23 : పారుపెల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు గురువారం రాత్రి వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను సుందరంగా తీర్చిదిద్దారు. బతుకమ్మలపై గౌరమ్మలను ప్రతిష్టించి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మలు ఆడుతూ కోలాటాలు నిర్వహించారు. ఆ తర్వాత స్ధానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 


ఘనంగా సద్దుల బతుకమ్మ 

తాండూర్‌(బెల్లంపల్లి) :  మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం తంగేడు, గుమ్మడి పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం ప్రధాన కూడళ్ల వద్ద  ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సద్దుల బతుకమ్మ వేడుకలు పలు చోట్ల 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు జరుపుకోవడం ఆనవాయితీ. తాండూర్‌లోని శివాలయం వద్ద బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. 

Updated Date - 2020-10-24T10:50:14+05:30 IST