Abn logo
Oct 15 2021 @ 00:41AM

పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ

ఆలేరులో మాట్లాడుతున్న విమలక్క

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, అక్టోబరు 14: జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగను గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. బతుకమ్మలను మహిళలు పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆధ్యాత్మిక, ఆహ్లా దకర వాతావరణం నెలకొంది. పూజల అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటల్ల్లో  నిమజ్జనం చే శారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ అని ప్రజా గాయిని,  అరుణో దయ సాంస్కృతిక సమాక్య రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు విమలక్క అన్నారు. ఆలేరులో ప్రేమ సేవా సదనం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడు కల్లో పాల్గొన్న ఆడపడుచులకు వాయినాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. బహుజన బతుకమ్మను పదేళ్లుగా నిర్వహి స్తున్నామన్నారు. గుట్ట, భూదాన్‌పోచంపల్లి పట్ట ణాల్లో  మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు ఎరుకల సుధ, చిట్టిప్రోలు విజయలక్ష్మి పాల్గొన్నారు. మోటకొండూ రులో  సర్పంచ్‌ వడ్డెబోయిన శ్రీలత ఆధ్వర్యంలో తీరొక్క పూలతో 10అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేశారు. మోత్కూరులో దుర్గాదేవి ప్రతిమలను బతుకమ్మలకు అమర్చి మహిళలు ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలేరులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో  మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంక రయ్య, కమిషనర్‌ మారుతీప్రసాద్‌  పాల్గొన్నారు. 

తుర్కపల్లిలో బతుకమ్మలతో యువతులు