సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-15T06:58:28+05:30 IST

సంస్కృతీ, సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ అని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని జన్మ భూమినగర్‌, రెడ్డికాలనీ, రాంనగర్‌, పాతమంచిర్యాల, ఏసీసీ, గౌతమినగర్‌ తదితర ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించు కున్నారు. తీరొక్క పూలు పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు.

సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
మందమర్రి రెండవ జోన్‌లో బతుకమ్మ పేరుస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు

ఏసీసీ,మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 14: సంస్కృతీ, సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ అని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని జన్మ భూమినగర్‌, రెడ్డికాలనీ, రాంనగర్‌, పాతమంచిర్యాల, ఏసీసీ, గౌతమినగర్‌ తదితర ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించు కున్నారు. తీరొక్క పూలు పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు కుల,మత ప్రాంతాలకు అతీతంగా నిర్వహిం చుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనేకమార్లు బతుకమ్మను స్మరిస్తూ ఉద్యమించిన తీరు మరువలేనిదన్నారు. రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రభుత్వం గుర్తించడం సంతోషదాయ కమ న్నారు. ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ నేతృత్వంలో బతుకమ్మ వేడుకలో పాల్గొనే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పటిష్టభద్రతకల్పించారు. మున్సిపాలిటి ఆధ్వర్యంలో మహిళలకు పలు సౌకర్యాలు కల్పించారు.  

ఫ మందమర్రిటౌన్‌ : పూలను పూజించే బతుకమ్మ పండగ సందడి ఇం టింటా నెలకొంది. గురువారం మందమర్రిలో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉదయం నుంచే తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. గౌరమ్మను తయారు చేసి పూజలు చేశారు. రెండో జోన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు నివాసంలో బతుకమ్మను పేర్చారు. మహిళలతో కలిసి బతుకమ్మను తీర్చిదిద్దారు. పట్టణం అంతటా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బతుకమ్మ గద్దెల వద్ద మున్సిపాలిటీ సిబ్బంది విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి పట్టణం లోని రామాలయం, మూడవ జోన్‌ రామాలయం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలు ఆడారు. డీజే పాటలకు అనుగుణంగా పాటలకు నృత్యాలు చేశారు. పట్టణం లోని సింగరేణి పాఠశాల మైదానంలో బతుకమ్మ పోటీలను నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు, ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌లు హాజరయ్యారు. సీఐ ప్రమోద్‌రావు, ఎస్‌ఐ భూమేష్‌లు పట్టణంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు. సింగరేణి మైదానంలో ఏర్పాటు చేసిన చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సేవా సమితి అధ్యక్షురాలు నేతృత్వంలో బతుకమ్మ పోటీలను నిర్వహించారు. 

 ఫ దండేపల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లోని గురువారం మహిళలు, యువతులు  సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు  సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆటాపాటలతో సందడి చేశారు. మహిళలు ఉదయం నుంచే రంగు రంగుల పూలతో బతుకమ్మను అందంగా అలంక రించారు.  గ్రామ సమీపంలో చెరువులు, వాగులో ఘనంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు.   దండేపల్లిలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు బతుకమ్మ వేడుకలను తిలకించారు. దండేపల్లిలో వాడవాడల్లో బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు వెళ్లి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.  ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌  గురువయ్య, సహకార సంఘం చైర్మన్లు  లింగన్న, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శు చుంచు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-10-15T06:58:28+05:30 IST