Abn logo
Oct 15 2021 @ 00:38AM

‘పూల’కించిన పుడమి

అశ్వాపురంలో సద్దుల బతుకమ్మ వేడుక

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

అతివల ఆటపాటలతో సందడేసందడి

పోయిరావమ్మా అంటూ బతుకమ్మకు ఘన వీడ్కోలు

చెరువులు, నదుల్లో నిమజ్జనం

నెట్‌వర్క్‌: తొమ్మిది రోజుల పాటు మహిళలతో విశేష పూజలం దుకున్న బతుకమ్మ గంగ ఒడికి చేరింది. మహిళల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సందడిగా సాగింది. గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు భద్రాచలం, అశ్వారావుపేట, పినపాకలో ఘపంగా జరిగా యి. అశ్వాపురం మండలంలో మేళతాళాలతో  బతుకమ్మలను గ్రామపొలిమేరలోని ముత్యాలమ్మ అమ్మవార్ల వద్ధఉంచి అమ్మవారికి నైౖవేద్యాలు సమర్పించారు. ఆటపాటల అనంతరం బతుకమ్మలను సమీపంలోని  చెరువులు, కాలువల్లో  నిమజ్జనం చేశారు.

బూర్గంపాడు మండల పరిధిలోని గొమ్మూరు వద్ద గోదావరిలో బతుకమ్మ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా దర్శనమిచ్చింది. తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎస్‌ఐ జితేందర్‌, సర్పంచ్‌ భూక్యా శ్రావణి, ఉపసర్పంచు ఝాన్సీ, పంచాయతీ కార్యదర్శి రాజేష్‌ పర్యవేక్షించారు.

చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.  గుం డాలలోని వివిధ గ్రామాల్లో అడపడుచుల పండగను ఘనంగా జరు పుకున్నారు. ఉదయాన్నే పూలను సేకరించి పోటాపోటీగా వివిద ఆకృ తులలో బతకమ్మను పేర్చి డప్పు వాయిద్యాలతో దేవాలయాల వద్ద, ప్రదాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఒక చోట చేర్చి పాటలతో నృత్యాలు చేశారు. గుండాల బతుకమ్మ ఘాట్‌ వద్ద మానాల భద్రయ్య శాంతమ్మ జ్ఞాపకార్థం తిరుకొళ్లురి వెంకటేశ్వర్లు, వివేకవర్దిని జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో మహిళలకు ప్రోత్సాహాకాలు అంద జే శారు. అనంతరం ఊర చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 

దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా పలు చోట్ల గురువారం సద్దుల బ తుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలు రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశా రు. అనంతరం బతుకమ్మలను సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు. 

దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పలుచోట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నాగుపల్లి, దమ్మపేట పరిధిలోని మావుళ్లయ్య బజారు, అర్బన్‌ కాలనీ,  సాయిబాబా గుడి బజారు, కొత్తపేట కాలనీలో నిర్వహించిన బతకమ్మ వేడుకలు, పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతకమ్మలు ఆడారు. అనంతరం బతకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచ్‌ చిన వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్‌ యుగంధర్‌, చామర్తి గోపి, యార్లగడ్డ బాబు, పానుగంటి చిట్టిబాబు, పాపారావు, పానుగంటి నాగేంద్ర, అబ్దుల్‌జిన్నా, ఏసుబాబు, ఎంపీటిసి ఆంగోతు భాస్కరరావు, సర్పంచ్‌ నాగమణి, ఉపసర్పంచ్‌ సర్వేశ్వరరావు, కృష్ణారావు, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

ఆళ్లపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం  మహి ళలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలలు వివిధ వర్ణలాతో బతు కమ్మలను ఆలయ ప్రాంగణాల్లో ఉంచి ఆడిపాడారు. మహిళలు వా యినాలు ఇచ్చుకున్నారు. 

కరకగూడెం మండలంలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చెరువుల నుంచి అల్లి పూలు, తంగేడు పూలతో పేర్చారు. మహిళలు భక్తి శ్రద్ధలతో తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణాల్లో బతుకమ్మలను ఉంచి పాటలు పాడి చెరువుల్లో నిమజ్జనం చేశారు.