Abn logo
Mar 2 2021 @ 01:18AM

బతుకమ్మ చీరలు, పాలిస్టర్‌ వస్త్రాల తయారీ కూలి పెంచాలి

సిరిసిల్ల రూరల్‌, మార్చి 1: బతుకమ్మ చీరలతోపాటు పాలిస్టర్‌ వస్త్రాల తయారీ  కూలి పెంచాలని ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పోరండ్ల రమే ష్‌, చేరాల అశోక్‌ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని పాలి స్టర్‌ వస్త్రోత్పత్తిదారుల సం ఘం భవనంలో సోమవారం అధ్యక్షుడు దూస భూమయ్య, కార్యదర్శి ఆడెపు భాస్కర్‌కు వినతి పత్రాలు అంద జేశారు.  2021లో బతు కమ్మ చీరలను డాబీలతో వెరైటీ డిజైన్లలో ఉత్పత్తి చేస్తు ండడంతో ఆసాములకు పనిభారం, ఖర్చు  పెరిగాయన్నారు. పాలిస్టర్‌ వస్త్రా లకు కూలి ఒప్పందం గడువు ముగిసి రెండేళ్లవుతోందని, ఇప్ప టికీ పెంచక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతు న్నాయని అన్నారు. సీఐటీ యూ నాయ కులు రమేష్‌,  రమణ, అసాముల సమ న్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement