త్వరలో ‘బీసీ బంధు’ పథకం

ABN , First Publish Date - 2022-01-27T06:37:10+05:30 IST

హుజూర్‌నగర్‌/మఠంపల్లి, జనవరి 26: రాష్ట్రంలో త్వరలో ‘బీసీ బంధు’ పథ కాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు.

త్వరలో ‘బీసీ బంధు’ పథకం
హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఎమ్మెల్యే సైదిరెడ్డి 

 హుజూర్‌నగర్‌/మఠంపల్లి, జనవరి 26: రాష్ట్రంలో త్వరలో ‘బీసీ బంధు’ పథ కాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు.  పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహిం చిన టీఆర్‌ ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సమాజంలో ఆర్థిక అసమానతలు తొలిగించడానికి ‘దళిత బంధు’ పథ కాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కేసులు వేసి నియోజక వర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. మూడేళ్లలో ‘దళితబంధు’ను అందరికీ అందిస్తామన్నారు.  అగ్రవర్ణ పేదలకు కూడా ప్రభు త్వం సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. దేశం దృష్టి మొత్తం రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే ఉందన్నారు.  కార్యక్రమంలో హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డికేఎల్‌ఎన్‌ రెడ్డి, గెల్లి రవి, అర్చన, జక్కుల నాగేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, పిచ్చయ్య, నాగేశ్వరరావు, కుంట సైదులు, మీసాల కిరణ్‌, మధు, నాగరాజు, ఫణి, పద్మారెడ్డి, కవిత పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-27T06:37:10+05:30 IST