కర్నూలు: బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి టీడీపీ కార్యకర్తలపై రౌడీలతో దాడులు చేయిస్తున్నాడన్నారు. అవసరమైతే కార్యకర్తలను కాపాడుకునేందుకు కత్తి పడతానని బీసీ జనార్ధన్‌రెడ్డి చెప్పారు. జైలుకైనా వెళ్తా కానీ ప్రజాధనం దుర్వినియోగం కానివ్వనని అన్నారు. ఆక్రమణలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎవరు రౌడీయిజం చేస్తున్నారో పోలీసులు గమనించాలని జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.