Abn logo
Oct 8 2021 @ 19:06PM

సీఎం కేసీఆర్ ను కలిసిన బిసి మంత్రులు

హైదరాబాద్: తెలంగాణలో బిసి కుల గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపధ్యంలో శుక్రకవారం పలువురు బిసి వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను కలిసిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ మంత్రి జోగు రామన్న, దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. కాగా బిసి కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు జాతీయ బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య కూడా సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

క్రైమ్ మరిన్ని...