బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-08-01T06:53:05+05:30 IST

56శాతంగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోను దుర్గానరేష్‌ డిమాండ్‌ చేశారు.

బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

బోను దుర్గానరేష్‌ డిమాండ్‌ 

విజయవాడ సిటీ, జూలై 31 : 56శాతంగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోను దుర్గానరేష్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు స్థానిక ధర్నాచౌక్‌లో శనివారం నిరసనదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు మెడికల్‌ సీట్లలో 27శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి ఆయన పాలభిషేకం చేశారు. 13 జిల్లాల నుంచి పలువురు బీసీ సంఘం నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T06:53:05+05:30 IST