Abn logo
May 5 2021 @ 10:42AM

ఐపీఎల్ వాయిదా.. నష్టమెంతో తెలుసా?

క్రికెట్ ప్రేమికులకు ఎంతో వినోదాన్ని.. బీసీసీఐకి, ఆటగాళ్లకు భారీ లాభాలను అందించే మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). దేశంలో విలయం సృష్టిస్తున్న కరోనా ఐపీఎల్‌ను కూడా తాకడంతో అప్రమత్తమైన బీసీసీఐ.. టోర్నీని అర్ధంతరంగా నిలిపివేసింది. 14 ఏళ్ల లీగ్‌ చరిత్రలో ఇలా మధ్యంతరంగా ముగియడం ఇదే తొలిసారి. 


ఈ లీగ్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఇప్పటికి 29 మ్యాచ్‌లే పూర్తయ్యాయి. ఈ టోర్నీ సగంలోనే నిలిచిపోవడం వల్ల బీసీసీఐకి దాదాపు రూ.2200 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. టోర్నీ ప్రసారకర్తలతోనూ, ఇతర స్పాన్సర్లతో ఉన్న ఒప్పందాల్లో ఎలాంటి షరతులు, నిబంధనలు ఉన్నాయనే అంశంపై పూర్తి సమాచారం లేదు. అయితే ఈ టోర్నీ పూర్తిగా రద్దయితేనే నష్టం జరుగుతుందని, ఈ ఏడాదిలో ఏమైనా తేదీల్లో మిగిలిన భాగాన్ని నిర్వహించగలిగితే సమస్య ఉండదని స్పాన్సర్లు భావిస్తున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement