సౌరవ్ పదవీకాలంపై విచారణ మరోసారి వాయిదా

ABN , First Publish Date - 2021-01-20T17:47:25+05:30 IST

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలకు పదవీ కాలం పొడిగింపుపై సుప్రీం కోర్టులో దాఖలైన కేసు విచారణ వచ్చే నెల 16కు వాయిదా పడింది.

సౌరవ్ పదవీకాలంపై విచారణ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాలకు పదవీ కాలం పొడిగింపుపై సుప్రీం కోర్టులో దాఖలైన కేసు విచారణ వచ్చే నెల 16కు వాయిదా పడింది. ఈ కేసు విచారణ బుధవారం సుప్రీం బెంచ్ ముందుకు రాగా.. విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు కేసు విచారణలో ఉన్న జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా ప్రకటించారు. ఇదిలా ఉంటే, బీసీసీఐ రాజ్యాంగ సవరణకు అనుమతించాలంటూ బోర్డు ట్రెజరర్‌ అరుణ్‌ దుమాల్‌ గతేడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. స్టేట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌, బీసీసీఐలో కలిపి వరుసగా ఆరేళ్లు పదవిలో ఉన్న ఈ ఇద్దరూ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం కచ్చితంగా మూడేళ్ల విరామం(కూలింగ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌) తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా సౌరవ్, జే ఆ పదవుల్లోనే ఉన్నారు. దీంతో రాజ్యాంగ సవరణలు కోరుతూ సుప్రీం కోర్టును బోర్డు ఆశ్రయించింది. గత డిసెంబర్‌లో పిటిషన్ విచారణకు రాగా... జనవరి మూడో వారానికి వాయిదా పడింది. అయితే తాజాగా మరోసారి ధర్మాసనం వాయిదా వేసింది.    


ఇదిలా ఉంటే,  బీసీసీఐలో అవకతవకలు జరిగాయంటూ ... జార్ఖండ్ క్రికెట్ అసోషియేషన్ ట్రెజరర్ నరేశ్ మకానీ కూడా పిటిషన్ దాఖలు చేశారు. బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధంగా పదవులు అనుభవిస్తున్నారంటూ నరేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-20T17:47:25+05:30 IST