Be Alert : ఇలాంటి ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త.. లేకుంటే అంతే సంగతులు!

ABN , First Publish Date - 2021-10-22T14:18:42+05:30 IST

ఇలాంటి ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త.. లేకుంటే అంతే సంగతులు!

Be Alert : ఇలాంటి ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త.. లేకుంటే అంతే సంగతులు!

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : డెబిట్‌ కార్డు పిన్‌ నంబర్‌ మార్చేందుకు ప్రయత్నించిన పైలెట్‌ ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ. 10.30 లక్షలు కాజేశారు. బేగంపేటకు చెందిన ప్రభాకర్‌రావు పైటెట్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పిన్‌ నంబర్‌ మార్చుకునేందుకు ప్రయత్నించగా ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చింది. దాంతో పిన్‌ మార్చే ప్రయత్నం విరమించుకుని ఇంటికెళ్లాడు. తర్వాత మీ కార్డు బ్లాక్‌ అయిందని, కేవైసీ అప్‌డేట్‌ చేసుకోమంటూ బ్యాంక్‌ పేరుతో సందేశం, లింక్‌ అతడి ఫోన్‌కు వచ్చాయి. పిన్‌ మార్చుకునే సమయంలో ఏర్పడిన లోపాన్ని గుర్తుచేసుకున్న అతడు లింక్‌ను తెరిచి అందులో వివరాలు నమోదు చేశాడు. ఫోన్‌కు వచ్చిన ఓటీపీని పలుమార్లు బ్యాంకు అధికారుల పేరుతో ఫోన్‌ చేసిన వారితో పంచుకున్నాడు. అనంతరం తన ఖాతా నుంచి రూ. 10.30 లక్షలు మాయమయ్యాయి. మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2021-10-22T14:18:42+05:30 IST