ఆచితూచి అడుగేయండి

ABN , First Publish Date - 2020-11-23T06:47:15+05:30 IST

కొన్ని వారాలుగా మార్కెట్లు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 13100-13200 స్థాయిలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని అవరోధాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మొత్తం ట్రెండ్‌ బుల్లి్‌షగా ఉన్నప్పటికీ ‘పడినప్పుడు కొనుగోలు చేయటం’ (బై ఆన్‌ డిక్లైన్స్‌) అనే వ్యూహాన్ని అమలు పరచటం మంచి ది...

ఆచితూచి అడుగేయండి

కొన్ని వారాలుగా మార్కెట్లు దూసుకుపోతున్నాయి. నిఫ్టీ 13100-13200 స్థాయిలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని అవరోధాలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. మొత్తం ట్రెండ్‌ బుల్లి్‌షగా ఉన్నప్పటికీ ‘పడినప్పుడు కొనుగోలు చేయటం’ (బై ఆన్‌ డిక్లైన్స్‌) అనే వ్యూహాన్ని అమలు పరచటం మంచి ది. ఈ వారం లాభాల స్వీకరణకు అవకాశాలు ఉండటంతో నిఫ్టీ 12600-12450 స్థాయిల వద్ద కదలాడే అవకాశం ఉంది. 


స్టాక్‌ రికమండేషన్స్‌

ధమ్‌పూర్‌ షుగర్‌: గత వారం ఈ షేరు మంచి జోరును కనబరిచింది. ప్రస్తుతం అప్‌ట్రెండ్‌ దిశగా సాగే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.150.65 వద్ద క్లోజైన ఈ షేరు రానున్న వారాల్లో రూ.163 స్థాయికి చేరుకోవచ్చు. అయితే రూ.143.40 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

యూబీఎల్‌: సమీప భవిష్యత్‌లో ఈ షేరు అద్భుతమైన పనితీరును కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.1,094.25 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న రోజులకు రూ.1,382 టార్గెట్‌ ధరతో ట్రేడర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1247 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

అశోక్‌ లేలాండ్‌: స్వల్పకాలిక చార్టుల ప్రకారం చూస్తే ఓవర్‌బాట్‌ పొజిషన్‌లోకి చేరుకున్నట్లు కనిపిస్తోంది. డైలీ చార్టులను పరిశీలిస్తే ‘షూటింగ్‌ స్టార్‌’ ప్యాట్రన్‌ను సూచిస్తుండటంతో లాభాల స్వీకరణకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత శుక్రవారం రూ.90.80 స్థాయిల వద్ద క్లోజైన ఈ షేరు రానున్న రోజుల్లో రూ.86 టార్గెట్‌ ధరను చేరుకునే చాన్స్‌ ఉంది.

 

ఒకవేళ బౌన్స్‌ అయితే రూ.93-94 స్థాయిల వద్ద షార్ట్‌ చేసుకోవటం బెటర్‌. రూ.96.70 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

 - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలిస్ట్‌,టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2020-11-23T06:47:15+05:30 IST