Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్యాంక్ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్ చేశాడా కుర్రాడు.. దెబ్బకు అకౌంట్లోంచి రూ.5.5 లక్షలు ఫట్.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగుల ప్రవర్తన అతడికి నచ్చలేదు. దీంతో ఆ కుర్రాడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్యాంకు ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. బ్యాంకు ఉద్యోగులపై ఫిర్యాదు చేశాడు. అనంతరం కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పిన విధంగా చేశాడు. అంతే.. దెబ్బకు అకౌంట్లోంచి రూ.5.5లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో ఆ కుర్రాడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అసలేం జరిగింది అంటే..


రాజస్థాన్‌కు చెందిన జితేంద్ర సింగ్ రాజ్‌పుత్.. కోత్వాలి ప్రాంతంతో ఉన్న సైనిక్ బస్తీ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. కాగా.. జితేంద్ర సింగ్ తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయించేందుకు స్థానికంగా ఉన్న బ్యాంకుకు వెళ్లాడు. అయితే.. అక్కడి బ్యాంకు ఉద్యోగులు.. పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయడానికి నిరాకరించారు. అంతేకాకుండా.. అకౌంట్ ఎక్కడ తీశారో.. ఆ బ్రాంచికే వెళ్లి అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు. దీంతో జితేంద్ర సింగ్‌ ఆగ్రహానికి లోనయ్యాడు. బ్యాంక్ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు కస్టమర్ కేర్ నెంబర్‌ను గూగుల్‌లో సర్చ్ చేశాడు. అనంతరం అక్కడ కనిపించిన నెంబర్‌కు ఫోన్ చేసి.. ఉద్యోగులపై ఫిర్యాదు చేశాడు. అనంతరం.. ఫోన్‌లో అవతలి వాళ్లు చెప్పిన విధంగా కొన్ని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని, కొంత సమాచారాన్ని వారికి ఇచ్చాడు.


 ఆ తర్వాత ఎందుకైన మంచిదని.. దగ్గరలోని ఉన్న ఏటీఎంకు వెళ్లి.. అకౌంటుకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్ తీసుకుని షాకయ్యాడు. బ్యాంకు ఖాతాలోంచి.. రూ.5.5లక్షలు కట్ అయినట్లు గుర్తించి కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం వారికి వెల్లడించి.. సహాయం చేయాలని అభ్యర్థించాడు. ఈ క్రమంలో జితేంద్ర నుంచి వివరాలు సేకరించిన తర్వాత.. సైబర్ నేరస్థుడు తనను తాను కస్టమర్ కేర్ ప్రతినిధిగా జితేంద్ర సింగ్‌కు పరిచయం చేసుకుని.. అతడి తండ్రి అకౌంట్లోంచి డబ్బులు కాజేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బ్యాంకు మేనజర్ సహాయంతో అతడి తండ్రి అకౌంట్‌ను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా.. కస్టమర్ నెంబర్‌ల కోసం ఇంటర్నెట్‌లో సర్చ్ చేయడం మంచిదికాదని పేర్కొన్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement