Abn logo
Sep 14 2021 @ 11:33AM

ఆన్‌లైన్‌లో కార్డుతో షాపింగ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : డెబిట్‌ కార్డును క్లోనింగ్‌ చేసి, రూ. రెండు లక్షలకు పైగా కాజేశారు. సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం.ప్రసాద్‌  కథనం ప్రకారం.. ఉప్పుగూడకు చెందిన మహిళ ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం తన డెబిట్‌ కార్డును ఉపయోగించేది. ఆమె డెబిట్‌ కార్డు నెంబర్‌, సీవీవీ నెంబర్‌ను కాపీ చేసి క్లోన్‌ చేసి కొత్త కార్డు సృష్టించిన కేటుగాళ్లు నేరుగా ఏటీఎంలలో పలు విడుతలుగా రూ.2.10 లక్షలు కాజేశారు. ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అవుతున్నట్లు వరుసగా మొబైల్‌కు మెసేజ్‌లు రావడంతో ఆందోళనకు గురైన మహిళ బ్యాంకుకు వెళ్లి ఆరాతీయగా తమకేం తెలియదని చెప్పారు. దీంతో సిటీ సైబర్‌క్రైమ్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్మరిన్ని...